మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మరికొద్దిరోజుల్లో కూలిపోనుంది.. అవునా.. చంద్రబాబు నివాసాన్నే కూల్చేస్తారా.. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోనే నారాయణ మంత్రిగా ఉన్నపుడు ఈ వివాదం చర్చకు వచ్చింది. అయితే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఎవరూ కిమ్మనలేదు. అయితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావడం పట్ల మరోసారి ఈ చర్చ లేవనెత్తారు.
జగన్ కూడా రాజధాని నిర్మాణానికి గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం కరకట్ట లోపల ఉన్న అన్ని కట్టడాలను తొలగిస్తామని అధికారులతో వెల్లడించారు. అయితే సీఎం చంద్రబాబు నివాసం కూడా ఆ కరకట్ట పరిధిలోకే వస్తుంది కదా, నిబంధనలకు విరుద్దంగా నదిలోనే ఉంది అని ఓ అధికారి ఆయనను ప్రశ్నించగా జగన్ దానికి సమాధానంగా పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకుండా కృష్ణానది కరకట్ట లోపల ఏం ఉన్నా.. అది మాజీ సీఎం నివాసమైనా కూడా తొలగిస్తామని చెప్పారట.. కరకట్ట లోపల నది నుంచి 100 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, చంద్రబాబు నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు.
కాగా ఈ వార్త బయటకు రావడంతో తో టీడీపీ నేతలంతా ఒక్కసారిగా షాకయ్యారు. అక్రమ కట్టడాల నిర్మూలనలో చంద్రబాబు నివాసంపై కన్నేసారా.? అంటూ గుసగులాడుకుంటున్నారు. అయితే అందరూ రాష్ట్రంలో ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉంటే చంద్రబాబుకు నది ఒడ్డునే స్థానం దొరికిందా అంటూ విరుచుకుపడుతున్నారు.