ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ సునామీకి టీడీపీ తట్టుకోలేకపోయింది.నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈ విజయం పై ఆనందం వ్యక్తం చేసారు దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి.ఈయన మొదటినుండి జగన్ పై అభిమానం చాటుకుంటున్నారు.ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ జగన్ సీఎం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని..ఆయన సీఎం అవ్వాలనే నాకోరిక తీరిందని అన్నారు.తాను గెలిచినా వెంటనే ముందుగా అనుకున్నట్టుగానే అమీర్‌పేట్, బేగంపేట్, పిలింనగర్‌లోని ఆలయాల్లో దేవుళ్లకు వస్త్రాలు ఇచ్చి మొక్కులు తీచుకున్నాడు.అంతేకాకుండా ఇకనైన చంద్రబాబు చేస్తున్న కుట్రలు,అరాచకాలు ఆపెస్తే బాబుకు పాదాభివందనం చేస్తా అని అన్నాడు.