పశ్చిమగోదావరి జిల్లాలోని వేలివెన్నులో ఘోర ఘటన జరిగింది. ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలుస్తుందన్న లగడపాటి సర్వేతో బెట్టింగ్ కట్టిన ఓ యువకుడు 23న విడుదలైయిన ఫలితాల్లో టీడీపీ పార్టీ ఓటమితో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణమైన ఘటన..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ 110-130 సీట్లతో అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పిన సర్వేలను నమ్ముకొని వీర్రాజు అనే యువకుడ టీడీపీ గెలుస్తుందని రూ.12 లక్షల పందెం కాశాడు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. తాను బెట్టింగ్ కట్టిన పార్టీ ఓడిపోవడంతో పురుగుల మందు తాగిన సదరు వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఓవైపు పార్టీ ఓటమిపాలు కావడం, మరోవైపు రూ.12 లక్షలు ఆవిరైపోవడంతో ఈరోజు ఉదయం పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు.
