ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వైసీపీఎల్పీ భేటీ రేపు జరగనున్నది.
ఈ నెల ఏపీలోని విజయవాడలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారని సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వనించారు.
దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం. అయితే ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎన్నికలకు ముందే కేసీఆర్ తెలిపిన సంగతి తెల్సిందే..