ఏపీలో నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ,పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ
నూట యాబై స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరమించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్
సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమైంది.
ఈ నెల ముప్పై తారీఖున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జగన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి కానున్న మూడో వ్యక్తిగా జగన్ చరిత్ర సృష్టించాడు. గతంలో అసోం లో ఫ్రపుల్లకుమార్ ముప్పై మూడేళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖిలేశ్ ముప్పై తొమ్మిదేళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నలబై ఆరు సం. ఆరు నెలలకే నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో అయితే గతంలో దామోదర సంజీవయ్య ముప్పై ఎనిమిదేళ్ళ పదకొండు నెలలు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నలబై ఐదేళ్ల ఐదు నెలలకు ముఖ్యమంత్రి
అయ్యారు..