తాజా ఫలితాలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు లెగ్ పవర్ పై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గింది అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖతమైంది. ఢిల్లీ వెళ్లారు.. ఆమ్ఆద్మీ పార్టీ చిత్తయింది. బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తుచిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు మాయావతి, అఖిలేశ్ యాదవ్ అడ్రస్ గల్లంతైపోయింది. ఆయన అశోక్ గహ్లోత్ ని కలిసారు.. రాజస్తాన్లో సింగిల్ సీటు కూడా రాలేదు. దేవగౌడతో భేటీ అయ్యారు ఫస్ట్ టైం ఆయన ఓడిపోయారు. చంద్రబాబు లెగ్ పవర్ అలాంటిది మరి. పవర్ లేకున్నా లెగ్పవర్ మాత్రం తగ్గలేదు. అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై జోకులు పేల్చుతున్నారు. పవర్ గనుక తగ్గింది అంటే తనకు ఆవేదనగా ఉండదండీ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.