ఏపీలో గత నెల ఏప్రిల్ పదకొండున జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 26 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా అధికార టీడీపీ పార్టీ అన్ని చోట్ల వెనకబడి ఉంది..
