ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఉన్నారు.గుంతకల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.
