2019 ఎన్నికలకు గాను సర్వే ఫలితాలు, ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేసిన లగడపాటి, సోషల్‌పోస్ట్, టీవీ5 సంస్థలు ప్రజల నాడీ పట్టడంలో బొక్కబోర్లా పడ్డాయి. టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ తమ పనికిమాలిన సర్వే రిపోర్ట్‌లతో ప్రజలను తీవ్ర గంధరగోళానికి గురిచేశాయి.టీడీపీ అధికారంలోకి వస్తుందని, టీడీపీ హవా జనాల్లో విపరీతంగా ఉందంటూ ఊదరగొట్టిన ఈ సర్వే సంస్థలు ఫలితాలు చెప్పడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి.
ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఆయా పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ తమ వింతవింత సర్వే రిపోర్ట్‌లతో ప్రజలను మభ్యపెడుతూ వచ్చాయి. సరిగ్గా ఇలాంటి సంస్థలే ప్రజలను అయోమయానికి గురిచేయడమే కాకుండా సర్వేల పట్ల ఉన్న విశ్వసనీయతను కూడా దెబ్బతీసేలా వీటి సర్వేలు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే టీడీపీ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, రాకపోతే చెప్పుతో కొట్టండంటూ ప్రెస్‌మీట్‌లో బీరాలు పలికిన లగడపాటి ఒక్కసారిగా ఫలితాలు తన సర్వేకు విభిన్నంగా రావడంతో అమెరికా చెక్కేసాడు.
టీడీపీకి కొమ్ముకాస్తూ టీడీపీకి పూర్తిస్థాయిలో వ్యూహాలు రచిస్తూ ఎప్పటికప్పుడు తమ సర్వేలను విడుదల చేసిన సోషల్‌పోస్ట్ (రాస్ట్ర) కూడా పనికిమాలిన సర్వేలతో ప్రజలను మభ్యపెట్టచూసాయి. ఇలాంటి సర్వేలు ప్రజలు కూడా పట్టించుకోకపోవడం మంచిది అనేందుకు ఈ సంస్థలే ఉదాహరణగా నిలిచాయి