2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తుండగా.. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీలున్నారు. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. దాదాపుగా 300 స్థానాల్లో బీజేపీ, 100లోపు స్థానాల్లో జాతీయ పార్టీలుండగా తర్వాత ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిలో వైసీపీ అగ్రస్థానంలో నిలిచింది. వైసీపీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తర్వాత డీఎంకే నిలిచాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎక్కువమంది ఎంపీలు కల ప్రాంతీయ పార్టీగా వైఎస్సార్సీపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో లోక్ సభలో వైసీపీ ఎంపీలు కచ్చితంగా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.