తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్)కు 1484,2. కిషన్ రెడ్డి (బీజేపీ)కు 2327,3. సాయి యాదవ్ (టి.ఆర్.ఎస్)కు 3403 ఓట్లు పాలయ్యాయి
