ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన ఆ మాధవ్, ఇప్పుడు ఎంపీగా ఎన్నికై అదే డీఎస్పీనుంచి సెల్యూట్ తీసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగింది.
