2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేతకు భద్రత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలోనే జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపధ్యంలో జగన్ కు మరింత భద్రత పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. రాష్ట్రంతో పాటుగా దేవవ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
