చంద్రబాబు నాయుడి న్యాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఊహించిన దానికంటే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యంతో వైఎస్సార్సీపీకి ఘన విజయం చేకూరడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబికుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు అక్షర సత్యాలు కావని తేలిపోయింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తాను గెలుస్తున్నానని చెప్తూనే కచ్చితంగా కేంద్రంలో ఫ్రంట్ కి సంబంధించి తాను కీలకపాత్ర పోషిస్తామంటూ పైకి డబ్బాలు కొట్టుకున్నారు.
అసలు తానే మోడిని దించుతానని కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్పుకున్నారు. అయితే కనీసం తాను ఎమ్మెల్యేగా గెలవడమే కష్టతరంగా మారిన నేపధ్యంలో చంద్రబాబు రియాలిటీలోకి వచ్చేసారు. ఆయనకు సలహాలిచ్చేవారి పంధాను కూడా మార్చినట్టు తెలుస్తోంది. రాజకీయాలకు చంద్రబాబు గుడ్ బై చెప్పడం చారిత్రాత్మక అవసరం కనిపిస్తోంది. ఆయనకు కూడ అందరూ సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాలకు విరామం పలికి మనవడితో శేష జీవితాన్ని గడపాలని చెప్తున్నారు.