తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రక్రియలో తొలి ఫలితం మహబూబాబాద్ నియోజకవర్గానిదేనని సమాచారం. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 22 రౌండ్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా 183 మంది పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో చాలా ఆలస్యం జరిగే అవకాశముంది. అయితే ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కూడా కనుచూపుమేర పోటిలో లేకపోవడం గమనార్హం
Tags bjp cip cpm kcr mim n uttam kumar reddt parlament elections results slider tdp telanganacm telanganacmo trs