ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
Tags andhrapradesh assembly elections apassembly elections chandhrababu jagan slider tdp ysrcp