ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి బరిలోకి దిగిన సంగతి విధితమే. అయితే ఈ రోజు గురువారం వెలువడుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థిపై 357ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీకి చెందిన మంత్రులు,హేమాహేమీలు ఇంతవరకు మెజారిటీ చూపించకపోవడం గమనార్హం..
