ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే మొత్తంగా 88 సీట్లు మేజిక్ ఫిగర్‌కు చేరాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న ట్రెండ్స్‌లో వైసీపీ మేజిక్ ఫిగర్ సులువుగా దాటిపోయింది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. దీంతో.. వైసీపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానులు జగన్ కోసం ఉండవల్లికి తరలి వస్తున్నారు. వైసీపీ ఖచ్చితంగా 130 సీట్లకు పైగా గెలిచే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
