మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి టీడీపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మంత్రి లోకేశ్ పై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆర్కే ఘన విజయం సాధించారు. అయితే ఆనాడు ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే… తన కేబినెట్లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు విడుదలైయిన ఎన్నికల ఫలితాల్లో అందరు విజయం సాదించారు. ముఖ్యంగా మంగళగిరిలో చంద్రబాబు తనయుడు కొడుకు నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే… తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని జగన్ ప్రకటించనట్లుగానే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయం అని తెలుస్తుంది. వ్యవసాయశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పక్కా సమచారం
