తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యవహారాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల మనోభావాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాస్తున్న రాతలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రాధాకృష్ణ వార్తలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ ఈ రాతలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ అభిమానుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి రాధాకృష్ణ అత్యంత దారుణమైన విమర్శలను ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా పోస్టుల్లో దాదాపుగా 90శాతం ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో కెసిఆర్ అనంతపురం పర్యటనను రాజకీయ వ్యూహంకోసం వాడుకున్నారని, కమ్మ – వెలమ సామాజికవర్గాల్ని కలపడం ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని కేసీఆర్ దెబ్బ తీయాలని అనుకుంటున్నారని గతంలో రాశారు.
అలాగే కెసిఆర్ భవిష్యత్తు వ్యూహాలను గుట్టును విప్పడంలో రాధాకృష్ణ చాలాసార్లు అత్యుత్సాహం ప్రదర్శించారు.. వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రాధాకృష్ణకు ఏమాత్రం ఇష్టం లేదనేది బహిరంగ రహస్యమే. తెలంగాణ ఉద్యమకాలంలో కూడా ఈపత్రిక చాలా తెలివిగా వ్యవహరించింది. ఇప్పుడూ అదే చాతుర్యాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తాను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కెసిఆర్ ఆంధ్ర మీడియాకు దగ్గరవ్వాలనుకున్నారు. దీనిలో చాలా వరకు విజయం సాధించారు కూడా.. కారణం తెలంగాణలో ఉన్నవారందరం కలిసుండాలి.. రాష్ట్రాభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకోవాలనేది ఆయన ఆలోచన.. గతంలో ఆంధ్రజ్యోతి కార్యాలయంలో మంటలు చెలరేగినప్పుడు కెసిఆర్ స్వయంగా వెళ్లి చూసొచ్చారు.
అప్పటికే తెలంగాణపై విషంకక్కుతున్న ఆయన కార్యాలయానికి వెళ్లడం తెలంగాణకు చెందినవారిలో చాలామంది నచ్చలేదు. ఆ విషయం రాధాకృష్ణకు కూడా తెలుసు.. అయినా కేసీఆర్ వెళ్లారు. నిజానికి తెలంగాణలో కుల రాజకీయాలు, కుల సమీకరణాలు చాలాతక్కువ. ఎక్కువగా ఇక్కడ రాజకీయ, ఉద్యమ సమీకరణాలే ఉంటాయి. వాటితోనే ప్రజాభిమానాన్ని చూరగొని అధికారం చేజిక్కించుకోవాలి.. ఈ ఫార్ములాలతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇక ప్రజా సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. అయినప్పటికీ నిత్యం ఏదో ఒక విధంగా విషం కక్కుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాధాకృష్ణ చేసిన వికృత చేష్టలు, పచ్చి అబద్ధపు రాతలు తెలంగాణ ప్రజలకు తెలియనిది కాదు.. ఇప్పటికే సహనం నశించిన సీఎం కేసీఆర్ కట్టుకథలతో విషం కక్కుతున్న ఆంద్రజ్యోతి పై న్యాయపరమైన చర్యలకు ఆదేశించారు.