ఎల్లో మీడియా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టే బ్యాచ్ అన్న ముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ మోజో టీవీ పై సోషల్ మీడియాలో నేటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మోజో టీవీ CEO రేవతి పై ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం…
” రవిప్రకాశ్ టీవీ9 నుండి అక్రమంగా దారిమళ్లించిన సొమ్ముతో స్థాపించిన మోజో టీవీ అనే ఒక డిజిటల్ చానెల్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుండి. ఇటు హిందూ మతం మీద, మరియు తెలంగాణ ప్రభుత్వం మీద, వై యెస్ జగన్ మీద విషం చిమ్మడం, మరో పక్క చంద్రబాబు నాయుడు కొమ్ముకాయడమే ఈ పచ్చ చానెల్ ఏకైక ఎజెండా.
శబరిమల వివాదం జరుగుతున్నప్పుడు అక్కడ కావాలని ఒక మహిళా రిపోర్టర్ను పంపించి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది ఈ మోజో టీవీనే. ఆ చానెల్ CEO మరియి పార్ట్నర్ రేవతి అక్కయ్య గత రెండు రోజులుగా పత్రికా స్వేచ్చ, జర్నలిజం విలువలు అంటూ తెగ గింజుకుంటోంది. బహుశా ఫోర్జరీ కింగ్ రవిప్రకాష్ శిక్షణ అనుకుంటా. కడుపునిండా తెలంగాణ మీద విషం నింపుకున్న ఈ మోజో టీవీ CEO గత ఏడాది కాలంగా చేస్తున్న పని చూస్తే ఎవరికైనా ఈమె అసలు రంగు తెలిసిపోతుంది.
మొన్న ఎన్నికల సమయంలో బాజాప్తా తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరించింది. “తెదేపాకు కాకుండా వేరేవాళ్లకు ఒక్క ఓటు వేసినా మిగిలేది సర్వనాశనమే…” అని ట్విట్టర్లో ట్వీట్లు వేసింది
ఎన్నికల సమయంలో తెలుగుదేశం క్యాంపెయిన్ పాటలు బాగున్నాయి అంటూ వాటిని విస్తృతంగా ప్రచారం చేసింది రేవతి. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక చానెల్ CEO ఇట్లా ఒక పార్టీకి ప్రచారం చేయొచ్చా?
ఎలెక్షన్ కమీషన్ మీద చంద్రబాబు చేసిన ప్రతి ఆరోపణను ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రీట్వీట్ చేసింది. జగన్ మీద అనేక అరోపణలు నేరుగా చేసింది. అందులో ధారాళంగా అన్-పార్లమెంటరీ పదజాలం వాడేసింది. ఆఖరికి సాటి స్త్రీ అని కూడా చూడకుండా YS షర్మిలను “కీచక్కా” అని సంబోధించిందంటే రేవతి పాటించే పాత్రికేయ విలువలు ఎంత ఘనమైనవో మనకు తెలుస్తోంది
తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకంగా రజాకార్ల ప్రభుత్వం అంటున్నదంటే ఈవిడగారి మనసులో తెలంగాణ మీద ఎంత విషం ఉన్నదో తెలుసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాదులో ఉంటూ ఆంధ్రలో ఓటింగు రోజు “మన” ఆంధ్రా వాళ్లంతా ఆంధ్రాలో చంద్రబాబుకు ఓటెయ్యాలని ఈమె గారి పిలుపులు. ఒక చానెల్ CEO గా పనిచేస్తూ అదే సమయంలో పచ్చ పార్టీకి ప్రచార ఏజెంటుగా పనిచేయడం రేవతి గారికి ఓకేనేమో కానీ జనాలు ఎలా ఊరుకుంటారు ఇట్లాంటి దగుల్బాజీ జర్నలిజం చేస్తే?
ఇక పొద్దున లేస్తే తెలంగాణలో జరిగే ప్రతి సమస్యను భూతద్దంలో చూపే మోజో టీవీ రేవతి అక్కయ్యకు గత ఏడాది కాలంలో ఆంధ్రలో ఒక్కటంటే ఒక్క అంశం దొరక్కపోవడం వారి నిష్పాక్షిక జర్నలిజానికి నిలువుటద్దం. ఆంధ్రలో చంద్రబాబు పాలనలో పాలూ, తేనే ప్రవహిస్తున్నాయని మోజో టీవీ రేవతి అక్కయ్య అభిప్రాయం అనుకుంటా.
ఉల్టా మొన్న ఎన్నికల రోజు రేవతి అక్క ట్విట్టర్ లో చంద్రబాబుకు హిస్ మాస్టర్స్ వాయిస్ గా పనిచేసింది. ఆంధ్రలో ఏకంగా 90% EVMs పనిచేయడం లేదని తప్పుడు ప్రచారానికి తెగబడ్డది మన మోజో టీవీ రేవతి అక్కయ్య. ఇదీ ఈమెగారి పచ్చ జర్నలిజం స్టైల్.
అక్కడ పెద్దగా పనులేవీ జరగలేదని తెలిసినా చంద్రబాబు పోలవరం చకాచకా కట్టేస్తున్నారని సంబరపడిపోతుంది రేవతి అక్కయ్య ట్విట్టర్లో. కానీ తెలంగాణలో శరవేగంగా నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం ఒక్క మాటా పెగలదు రేవతి అక్కయ్యకు. పయోముఖ విషకుంభానికి పర్యాయ పదమే మన రేవతి అక్క అన్నమాట.
పనిచేసేది తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాదులో కానీ మనిషిక్కడ, మనసక్కడ అన్నట్టు, పొద్దునలేస్తే ఆంధ్ర గురించి, చంద్రబాబు పాలన గురించి పాజిటివ్ ప్రచారం చేయడమే ఈవిడ గారి దినచర్య. ఇంతకూ టీవీ9 నుండి ఎన్ని డబ్బులు మోజోలోకి ప్రవహించాయో ఆ లెక్కలు తేలిస్తే అప్పుడు బయటపడుతుంది వీరి వ్యవహారం. అది బయటపడకుండానే ఈ దొంగనాటకాలన్నీ. మోజో టీవీలో పనిచేస్తున్న డజన్లకొద్దీ ఉద్యోగులకు ప్రతినేలా బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఎందుకు జీతాలు ఇస్తున్నారో, ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినయో తెలిస్తే ఈ దొంగచానెల్ బండారం మొత్తం బయటపడుతుంది.
జర్నలిజం ముసుగులో చంద్రబాబు ఏజెంటుగా, పచ్చపార్టీ ప్రచారకర్తగా ఉన్న ఈమె ఇటీవల ఈమె మీద ఎవరో దాడిచేస్తున్నారనీ, ఈమెను ఏకంగా చంపడానికి ప్రయత్నిస్తున్నారనీ దొంగ ఏడుపులు మొదలుపెట్టింది. ఈమె నైజం తెలిసిన జనం బాగానే గడ్డి పెడుతున్నారు. ఈమె పచ్చ పిశాచం అని తెలియని వారికోసం ఈ వివరాలు అందిస్తున్నాం. “