కర్నూల్ జిల్లాలో దరుణ హత్య జరిగింది. జిల్లాలోని తెలుగుదేశం నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. డోన్ మండలం మల్లెంపల్లి గ్రామ సమీపంలో ఈరోజు అనగా( బుధవారం) రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్ వెళ్తుండగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేఖరరెడ్డి ఇటీవలే కోట్ల వర్గం సమక్షంలో టీడీపీలో చేరారు.శేఖర్ రెడ్డి.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుచరుడు కావడంతో.. ఈ హత్యోదంతం కాస్తా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా రాజకీయ కోణం వైపు దర్యాప్తు సాగించేలా చేస్తోంది. హతుడు శేఖర్ రెడ్డి కోట్లకు అనుచరుడే అయినప్పటికీ.. చాలాకాలం నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారం చేశారని స్థానికులు అంటున్నారు
