Home / 18+ / చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం

చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా, పదేళ్లపాటు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసిన ఏకైక నాయకుడు నారా చంద్ర‌బాబు నాయుడు మళ్లీ విభ‌జ‌నానంత‌ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కూడా తొలి ముఖ్య‌మంత్రి చంద్రబాబే.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టినుంచీ కూడా ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్నానంటూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలన్నీ తిరిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా చంద్రబాబే. కేవలం అనుభ‌వం ఉన్న నాయ‌కుడు కాబట్టే ఆయనను 2014లో రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మళ్లీ చంద్రబాబుకు ఏపీ ప్రజలు అవకాశమిచ్చారు. 1950లో జ‌న్మంచిన చంద్ర‌బాబుకు ఇప్పుడు 67 ఏళ్ళ వ‌య‌స్సు.. 28 ఏళ్ళ వ‌య‌స్సుకే చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

నాటి సీఎం అంజ‌య్య మంత్రివ‌ర్గంలో ప‌నిచేశారు. 1983లో ఎన్‌టీఆర్ తెలుగుదేశం ప్ర‌భంజ‌నంలో చంద్ర‌బాబు ఓడిపోయి.. వెంట‌నే ఎన్‌టీ రామారావు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అయ్యారు. మళ్లీ 1994లో టీడీపీ విజ‌యం సాధించి ఎన్‌టీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టాక తిరుగుబాటుకు నాయ‌క‌త్వం వ‌హించి ఎన్‌టీ రామారావును పదవినుంచి దించేసారు. ఎన్‌టీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చి చంద్ర‌బాబు సీఎం అయ్యారు. అప్పుడే చంద్రబాబు వెన్నుపోటు ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. త‌ర్వాత 96 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీలో స‌గం ఎంపీల‌ను గెలిపించి చంద్ర‌బాబు త‌న స‌త్తా చాటారు. కేంద్రంలో ఏర్ప‌డిన యునైటెడ్ ఫ్రంట్‌కి క‌న్వీన‌ర్‌గా కూడా ప‌నిచేశారు.

అప్పుడే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్రంలో న‌క్స‌లైట్ల స‌మ‌స్య తీవ్రంగా ఉండేది. అప్పటి హోంమంత్రిగా ప‌నిచేసిన మాధ‌వ‌రెడ్డిని మందుపాత‌ర పేల్చి చంపారు. ఈ ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందనే వార్తలూ వినిపించాయి. 2003లో తిరుప‌తి ద‌గ్గ‌ర‌ అల‌పిరలో మందుపాత‌ర పేల్చి చంద్ర‌బాబును హ‌త్య‌చేయ‌డానికి న‌క్స‌లైట్లు కుట్ర పన్నారు. గాయాల‌తో చంద్ర‌బాబు బ‌య‌ట‌ప‌డ్డారు. 1999లో ఒంటిచేత్తో పార్టీని గెలిపించి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు 2004 ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో, వైఎస్ హవాలో ఓడిపోయారు. 2009లో కూడా వైఎస్సార్ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. అయినా తెలుగుదేశం పార్టీని నిల‌బెట్టుకుని రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, జనసేనల సహకారంతో విజ‌యం సాధించారు. రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రించిన రెండు క‌ళ్ళ సిద్ధాంతం తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది.

తెలంగాణ‌లో ప్ర‌త్యేక రాష్ట్రం కావాలని, ఏపీలో విభ‌జ‌న పాపం కాంగ్రెస్ దే అంటూ చంద్రబాబు రెండు తలల సిద్ధాంతాల్ని అవలంబించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఐదేళ్ళు ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని మ‌న్‌మోహ‌న్‌సింగ్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టిస్తే, ప‌దేళ్ళు కావాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. ప‌దిహేనేళ్ళు ఇవ్వాల‌ని టీడీపీ కోరింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇదే ప్ర‌ధానాంశంగా రాజకీయాలు నడిచాయి. హోదా కుద‌ర‌దు.. ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. హోదా కంటే ప్యాకేజీయే బెట‌ర‌ని చంద్ర‌బాబు మెల్ల‌గా ఆమోదించారు. గతంలో హోదా కో్సం పోరాడుతాన‌న్న చంద్ర‌బాబు త‌ర్వాత స్వ‌రం మార్చి హోదా వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. ఈ నాలుగేళ్లలో తాత్కాల‌క స‌చివాల‌యం, అసెంబ్లీ హైకోర్టు నిర్మాణ‌మ‌య్యాయి. ఒక్క శాస్వత భవనం కూడా నిర్మించలేదు. రాజధానిలో, పోలవరం లో, ప్రభుత్వ పధకాల్లో ఇలా ప్రతీ అంశంలో అవినీతి చంద్రబాబును వెంటాడుతుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన పసుపు కుంకుమలు, పేపర్లు, టీవీలకు పరిమితమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను గట్టెక్కించలేకపోతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat