గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లోనూ అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, అభ్యర్ధుల ఎంపికపై కూడా సరియైన నిర్ణయం తీసుకున్నాడు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్న జగన్ అదే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చాడు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నాలు చేశాయి. కాని వైఎస్ జగన్ పార్టీ సీట్లు ఆశిస్తున్న వారి పేర్లు దగ్గర పెట్టుకుని ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని చాలా చక్కగా అంచనా వేశారు.మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి తెలుగు తమ్ముళ్లకు సవాల్ విసిరారు. అదే వైఎస్ జగన్ తొలి విజయం అయ్యింది. ఇతర పార్టీలు 3 నుంచి 4 విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చారు. అందులోన టిక్కెట్ విషయంపై పెద్ద పెద్ద మార్పులే జరిగాయి. మరి కొన్ని చోట్ల పార్టీని కూడ వీడినారు. దీంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయినారు. అదే జగన్ 175 మంది ప్రకటించిన ఎక్కడ ఏ చిన్న అలక కూడ పార్టీలో జరగలేదు “దటిజ్ ఈజ్ జగన్ “అంటున్నారు వైసీపీ అభిమానులు.
