యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నిన్న ఫాన్స్ కి ఒక సర్ ప్రైజ్ ఇస్తానన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రభాస్ సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాడు.దీంతో ప్రభాస్ ఫాన్స్ ఒక్కసారిగా ఆనందంలోకి వెళ్ళిపోయారు.ఈ పోస్టర్ లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.అయితే ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ డైరెక్ట్ చేసాడు.ఇప్పటికే ప్రభాస్ ఫాన్స్ సాహో కోసం ఏ రేంజ్ లో ఎదురుచుస్తున్నారో అందరికి తెలిసిందే.ఈ సర్ ప్రైజ్ పోస్టర్ లో అందరికి సినిమా రిలీజ్ యొక్క క్లారిటీ కూడా వచ్చేసింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్ లో తీయడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
