ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఎన్డీఏయేతర పార్టీల నేతలు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈభేటీ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు వీరంతా ఈసీని కలవనున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర సమస్యలను పరిష్కరించాలని, ఈవీఎంల పనితీరులోని అనుమానాలున్నాయంటూ వీరంతా ఈసీని కోరతున్నారు. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.. దీంతో దేశంలో కూటమిని ఏర్పాటు చేస్తానంటూ ఢిల్లీ, లక్నోలు తిరగడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు పర్యటనలపై దేశంలోని నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈయన గెలవడు.. పట్టుమని 10 ఎంపీలు లేనపుడు వరుస సమావేశాలతో విపక్ష నేతలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో అర్ధం కావట్లేదు.
ఏడోదశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయావతి, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్‌లను ఫోటోలకోసం హింస పెడుతున్నారని, సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేల డబ్బుతో కొనే సంప్రదాయం మొదలు పెట్టింది చంద్రబాబే.. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది కూడా చంద్రబాబే.. దేశమంతా ఈయన చేసిన ఘన కార్యాలు వెలుగుచూసాయి. ఇలాంటి నీతిమాలిన పనులకు తెగబడ్డాడంటూ అందరూ మండిపడ్డారు. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా అందరికీ అర్థమైంది. ఈ నేపధ్యంలో ఎవ్వరూ నమ్మని లగడపాటి రాజగోపాల్ సర్వేను అందరికీ చూపించారట.. దీంతో వారంతా విసుక్కున్నారట.. దీంతో పాపం అటు ఇటు కాకుండా చంద్రబాబు మారిపోయాడని విజయసాయి రెడ్డి తాజాగా ట్వీట్ చేసారు.
అందరినీ అంటిపెట్టుకుని తిరుగుతుండడంతో ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని, పిలవని పేరంటంలా అందరి ఇళ్లకు వెళ్లి పడి ఫోటోలు దిగుతుంటే అందరూ ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేంటని జోకులేసుకుంటున్నారంటూ చంద్రబాబునుద్దేశించి జోకులు పేల్చుతున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా గాంధీ, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేయడం పట్ల సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లంతా కచ్చితంగా లగడపాటిని లగెత్తించి కొడతారంటూ విమర్శిస్తున్నారు. లగడపాటి మాజీఎంపీ కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ తీసుకోవాలని సలహాలిస్తున్నారు.