మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నీ ట్యాంపరింగ్‌కు గురి అయ్యాయని ఆరోపించారు. అంతేకాదు ప్రజశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్‌కు ఓటేస్తే… అది కాస్త వైసీపీ గుర్తు ఫ్యాన్‌కు పడిందన్నారు కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్‌పై స్పందిస్తూ ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయిందన్నారు కేఏ పాల్ పేర్కొన్నారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్కడ హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు కేఏ పాల్. అంతేకాదు 70 నుంచి 80 శాతం ఓట్లు తమ ప్రజా శాంతి పార్టీకే పడ్డాయని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు కేఏ పాల్. ఎన్నికల ప్రచార సమయంలో కేఏ పాల్ చేసిన హాడావీడి అంతా ఇంతా కాదు.సోషల్ మీడియా దద్దరిల్లింది. ఎన్నికల తరువాత కనిపించకుండా పొయిన కేఏ పాల్ ఎగ్జిట్ పోల్స్ రాగానే అదే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ కేఏ పాల్ హల్ చలే
