పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అబ్బాయి దొరకడం లేదు ఏం చేయాలి చెప్పండి అంటూ చెప్పిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం పెళ్లికి రెడి అయినట్లు తెలుస్తుంది. అమ్మాయిలకు పాతికేళ్లు వస్తే చాలు పెళ్లెప్పుడనే ప్రశ్నలు లేవనెత్తుతారు. అలాంటిది 35 కు చేరువ అవుతున్న కాజల్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది సమాజం..? అందుకే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌కు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. ఈమె వయసు కూడా 35 కి చేరువైంది. దాంతో పెళ్లెప్పుడూ అనే ప్రశ్న ఈమెను కూడా బాగానే వేధిస్తుంది. తాజాగా మరో హాట్ న్యూస్ వైరల్ అవుతుంది. మంచి అబ్బాయి దొరికితే పెళ్లికి సిద్ధమంటూనే చాలా తెలివిగా కన్ఫ్యూజన్‌లో పడేసిన కాజల్ కు అబ్బాయి దొరికినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇటీవలనే తనకంటే చిన్నవాడైన నికోల్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఇదే బాటలో కాజల్ కూడ రెడి అయినట్లు తెలుస్తుంది. అతనితోనే వరుసగా రెండు సినిమాలు చేసిన కాజల‌్, ఆహీరోతోనే ప్రేమలోపడ్డట్లు తెలుస్తుంది. కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో కూడా గతంలో ఎప్పుడూ ఏ హీరోతో కూడా తీసుకున్న ఫోటోలు అప్ లోడ్ చేయని కాజల్.. తాజాగా ఆ హీరోతో కొన్ని టిక్ టాక్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెల్ఫీలు, పలు ఇవెంట్స్ లో కలిసి పాల్గొనడం ఇలా అన్నింటినీ అప్ లోడ్ చేసింది. ఇవన్నీ చూస్తూన్న నెటిజన్లు.. అతనితోనే కాజల్ పెళ్లికి సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
