ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే మాత్రం రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఈ నేపధ్యంలో మే 27 వరకూ మాత్రం ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. అలాగే డీజీపీ మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. నాలుగు అంచెల బందోబస్తు కు 25 వేల మంది విధుల్లో ఉంటారని, 16 పట్టణాల్లో లెక్కింపు జరుగుతుందన్నారు. సెక్షన్ 30, సీఆర్పీసీ 144 లు అమల్లో ఉందని, రౌడి షీటర్లను, సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేస్తామన్నారు.అనుమతి లేకుండా విజయోత్సవ సభలు ఊరేగింపులు జరపకుడదు.సాంకేతికతను ఉపయోగిస్తున్నాం.15 వేల సీసీ కామెర్లు, 68 డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు వాడుతాం