ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైసీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్‌సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్’గెలుచుకోనుంది. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలే ఎగ్జిట్ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా తుదివిడత పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియగానే ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ – జన్‌కీ బాత్, ఇండియాటుడే, మిషన్ చాణక్య, ఆరా, సీపీఎస్, ఏబీపీ నీల్సన్ మార్గ్ , సీఎన్ఎన్ న్యూస్ –18, ఐ పల్స్, కేకే సర్వీస్ తదితర సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఏపీలో వైసీపీ విజయదుందుభి మోగిస్తుందని, కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికార పగ్గాలు చేపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీకి మూడింట రెండొంతులకుపైగా మెజార్టీ ఖాయమని తెలిపాయి. ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు ప్రకటించిన తాయిలాలు ఏమాత్రం పనిచేయలేదు. జనం జగన్‌కే జైకొట్టారు
