ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది.ఈసారి దీనికి లండన్ వేదిక కానుందనే విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు అన్ని జట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.ఇక భారత్ పరంగా చూస్కుంటే మన జట్టు ఎలా ఉంది.ఇందులో కీలక ఆటగాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాం.
రోహిత్ శర్మ:
రోహిత్ శర్మ..అందరు ముందుగా పెట్టుకున్న పేరు హిట్ మాన్.ఇతడికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంది.ఇప్పటివరకు ఎవరూ చెయ్యలేని స్టంట్ అతడు చేసాడు..ఏకంగా మూడు డబల్ శతకాలతో రికార్డు సృష్టించాడు.అయితే రానున్న ప్రపంచకప్ లో రోహిత్ ఇప్పుడు ఉన్న ఫామ్ కొనసాగిస్తే భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్ళడం కాయమనే చెప్పాలి.ఒకవేళ విఫలమైతే మాత్రం భారత్ కు కష్టమనే చెప్పాలి.
శిఖర్ ధావన్:
మరో డాషింగ్ ఓపెనర్ ధావన్..సెహ్వాగ్ తరువాత అంతటి ధైర్యంగా ఆడే ఆటగాడు ఇతడే.మన దేశంలో కన్నా బయట దేశాలలో గట్టిగా ఆడడంలో సమర్ధుడు.మెగా ఈవెంట్స్ అన్నింటిలోను ధావన్ కు మంచి రికార్డు ఉంది.అందులోను ఇంగ్లాండ్ పిచ్ లలో ధావన్ కు మంచి రికార్డు కూడా ఉంది.ఈ ఓపెనర్స్ ఇద్దరు ప్రపంచకప్ లో మంచి ఆటను కనబరుస్తే ఇక ఇండియాను ఆపడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు విఫలమైన భారత్ కు కష్టమే.
విరాట్ కోహ్లి:
టీమిండియా యువ కెరటం..అతి చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి ప్రస్తుతం భారత్ జట్టు సారధిగా వ్యవహరిస్తున్నాడు కోహ్లి.తను బ్యాట్ పట్టుకుంటే పరుగుల వరదేనని చెప్పుకోవాలి. అంతకుమించి కోహ్లికి చేసింగ్ అంటే చాలా ఇష్టమనే చెప్పాలి ఎందుకంటే తాను కొట్టిన శతకాలలో ఎక్కువ సెకండ్ ఇన్నింగ్స్ లో కొట్టినవే.తాను కెప్టెన్ గా కోహ్లికి ఇది మొదటి ప్రపంచకప్.మరి ఈసారి తన అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
మహేంద్రసింగ్ ధోని:
ఎంఎస్ ధోని..ఈ పేరు వింటే ఎవరికైనా దైర్యం వస్తుంది ఎందుకంటే తాను మన జట్టు కి తెచ్చిన పేరు అలాంటిది.భారత్ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చాడు.2007లో భారత్ కు టీ20 ప్రపంచకప్ తెచ్చిపెట్టాడు.ఆ తరువాత ఇండియా విజయాల పరంపర కొనసాగింది.తన ఆటతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎన్నోసార్లు విజయాలు అందించాడు.ప్రస్తుతం మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు.ధోని జట్టులో ఉంటే అందరికి ఒక ధైర్యమని చెప్పాలి.కోహ్లికి తోడుగా ఉంటూ ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించనున్నాడు.
హార్దిక్ పాండ్య:
ప్రస్తుతం భారత్ జట్టుకు బెస్ట్ అల్ రౌండర్ ఎవరూ అంటే అది హార్దిక్ పాండ్య అనే చెప్పాలి.ఎందుకంటే తాను ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించే సత్తా కూడా ఉంది.అటు బౌలింగ్ లో,బ్యాట్టింగ్ లో ఫీల్డింగ్ లో కూడా మంచిగా రాణిస్తాడు.భారత్ కు మిడిలార్డర్ గట్టిగా ఉంది అని చెబుతున్నాము అంటే అది హార్దిక్ ఉన్నాడనే ధైర్యంతోనే..ఈ ఇతడు ఈ ప్రపంచకప్ మెరుగైన ఆట ఆడితే విజయం మనదే.
బుమ్రా:
బుమ్రా..ఇతడు బౌలింగ్ కు వస్తున్నాడు అంటే ఎంతటి ఆటగాడు ఐన భయపడాల్సిందే.ఇతడు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ అని పేరు కూడా ఉంది.ఈ వరల్డ్ కప్ లో బౌలర్స్ పరంగా చూసుకుంటే అందరి దృష్టి బుమ్రా పైనే ఉందని చెప్పాలి.మరి బ్యాట్టింగ్ ఎలా ఉన్న లండన్ పిచ్ లలో బౌలింగ్ నే కీలకం అని చెప్పాలి.బుమ్రా పై పెట్టుకున్న ఆశలు నిజం చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.