ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న నేరాలు అన్ని ఇన్ని కావు. నేరాల్లో ఎన్ని నేరాలు ఉంటే అన్ని టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఎన్నో సార్లు విమర్శించారు. హత్యలు, ఇసుక దందా, రౌడియిజం, భూ కుంభకోణం ఇలా ఎన్నో చేశారు. తాజాగా కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా విక్రయిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అధికారులు సోమవారం పక్కా వ్యూహం ప్రకారం దాడి చేశారు. బలుసు తిప్ప, భైరవపాలెం నుంచి కాకినాడకు సముద్ర మార్గాన పడవల సహాయంతో రవాణా చేస్తుండగా సూర్యరావు వంతెన వద్ద అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే పట్టుబడ్డ నాటుసారా బస్తాలపై టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఫ్లెక్సీల మీద కాకినాడ రూరల్ ఎమ్మేల్యే పిల్లి అనంత లక్ష్మి దంపతులు ఫోటోలు కనిపించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ దాడిలో స్థానిక టీడీపీ నేత బుజ్జి నాటుసారాతో పట్టుబట్టారు. గతకొంత కాలంగా నేమాంలో జోరుగా నాటుసారా వ్యాపారం జరుగుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ శాఖ చూస్తూ ఉండిపోయిందని స్థానికులు వాపోయారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరుడు తెలిపారు.