Home / MOVIES / అభిమానులను కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ కు హ్యపీ బర్త్ డే

అభిమానులను కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ కు హ్యపీ బర్త్ డే

నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరో స్థాయికి చేరుకున్న నందమూరి తారక రామారావు(జూ.ఎన్టీఆర్) పుట్టినరోజు నేడు. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు మే 20, 1983లో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నతనంలోనే ‘బాలరామాయణం’తో మెప్పించిన ఆయన నేషనల్ అవార్డును అందుకొని, నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అవతరించాడు. ఈ సినిమా తరువాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. అక్కడి నుంచి ఎన్టీఆర్ తన జైత్రయాత్ర కొనసాగించాడు. ఆది, సింహాద్రి, యమదొంగ, సాంబ, అదుర్స్, బృందావనం, బాద్ షా, నాన్నకు ప్రేమతో, టెంపర్, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. టెంపర్ తరువాత ఎన్టీఆర్ కు ఫెయిల్ లేదు.

తాజాగా రాజమౌళితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. చారిత్రాత్మక కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవరసాలను తనలో పలికించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మంచి డ్యాన్సర్ కూడా. డైలాగ్స్ చెప్పడంతో పెద్ద ఎన్టీఆర్ కు ఏ మాత్రం తీసిపోడు. ఈరోజు అంటే మే 20 వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు. మాములుగా ఎన్టీఆర్ పుట్టినరోజును ఫ్యాన్స్ అద్భుతంగా జరుపుతుంటారు. కానీ, ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉన్నాడు.కానీ అభిమానులు, టాలీవుడ్ నటుల విషేష్ తో సోషల్ మీడియా దద్దరిల్లుంతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat