2019 ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉండగా. పలు సర్వే సంస్థలు, నేషనల్ న్యూస్ ఛానెళ్ల సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. పలు సర్వేసంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్‌లను ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్రజలను తీవ్రమైన గంధరగోళానికి గురిచేయడమే కాకుండా సర్వే ఫలితాలపై విశ్వసనీయత సన్నగిల్లేల్లా చేస్తుంది.
అసలు సర్వే చేసే సంస్థలు సర్వే చేసే పద్ధతులేంటి..? సర్వే చేసేటప్పుడు పాటిస్తున్న విధానాలేంటి..? సర్వేలను ఎలా నమ్మాలి.? అనే అంశాల్లోకి వెళితే… కొన్ని సంస్థలు ఒక వ్యక్తికి అనుకూలంగా సర్వే చేయడం. లేదా ఒక పార్టీకి అనుకూలంగా సర్వే చేయడం. లేదా ఒక ప్రాంతానికే పరిమితవ్వడం చూస్తూ ఉన్నాం.
ఇటీవలి ఎన్నికల్లో ఆంధప్రదేశ్‌లో మా కరణ్ కాన్సెప్ట్స్ గ్రూప్‌లోని దరువు టీవీ నిర్వహించిన సర్వే గురించి. ఇపుడు వివరిస్తాం.
మా సర్వే విశ్వసనీయతను మీ ముందు ఉంచుతున్నాం. గతంలో తెలంగాణలో మేం నిర్వహించిన సర్వే ఫలితాలు టీఆర్ ఎస్ పార్టీకి 87 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు, బీజేపీకి 3 సీట్లు, ఎంఐఎంకు 5 సీట్లు, ఇతరులకు 4 సీట్లు వస్తాయని మేం చేసిన సర్వే ఫలితాలు తెలియజేయగా అందుకు రెండు మూడు సీట్లు అటూఇటూ అవ్వడం మినహా అత్యంత ఖచ్చితంగా మా సర్వే ఫలితాలు ఉండటం మా సర్వే విశ్వసనీయతకు నిదర్శనం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి ఎన్నికలకు గానూ మా కరణ్ కాన్సెప్ట్స్ గ్రూప్‌లోని దరువు టీవీ నుంచి సుమారుగా 1500 మందికి పైగా సర్వే ఏజెంట్లతో ఈ సర్వే నిర్వహించాం. ఈ సర్వే ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని మీరు విశ్వసించవచ్చు.
ఇదే మా సర్వే విధానం..
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు సర్వే నిర్వహించిన మా కరణ్ కాన్సెప్ట్స్ గ్రూప్‌లోని దరువు టీవీ ఈ సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ సర్వేను నాలుగు రకాలుగా విభజించాం. అందులో భాగంగానే ముందుగా పొలిటికల్ సర్వే, డెవలెప్‌మెంట్ సర్వే, లీడర్‌షిప్ సర్వే మరియు ఓటర్ ఇన్ల్ఫ్యూయెన్సర్స్ సర్వే ఇలా నాలుగు రకాల సర్వే చేశాం.
పొలిటికల్ సర్వేలో భాగంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి, ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏ పార్టీ మానిఫెస్టలో ప్రజలను ఆకర్షించేలా ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. అన్న అంశాలు ప్రాతిపదికన తీసుకుని ప్రత్యేకమైన ప్రశ్నావళితో ప్రజల ముందుకు వెళ్లాం.
డెవలెప్‌మెంట్ సర్వేలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది. ఆయా నియోజకర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరిగాయి. మౌలిక వసతులు తదితర అభివృద్ధి అంశాలపై ప్రత్యేకమైన ప్రశ్నావళిని రూపొందించాం.
లీడర్‌షిప్ సర్వేలో భాగంగా సీఎంగా ఎవరుంటే బాగుంటుంది. మీ ఎమ్మెల్యేగా ఎవరుండాలి అనుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.? ప‌్రతిపక్ష నేత పనితీరు ఎలా ఉంది.? ఇరు నేతల బలాబలాలేంటి.? ఇలా అనేక అంశాలపై ప్రశ్నావళి రూపొందించాం.
ఓటర్ ఇన్ఫ్ల్యూయెన్సర్స్ సర్వేలో భాగంగా స్థానిక నాయకులు, చిన్నపాటి లీడర్లు ఏ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అధికార పార్టీకి ఎక్కువ ఓట్లు ప్రభావితం చేసే నాయకులున్నారా.? ప‌్రతిపక్ష పార్టీకి ఓట్ ఇన్ఫ్ల్పూయెన్సర్ ఎక్కువ ఉన్నారా.? వీరు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించనున్నారు.? ఇలా అనేక రకాల ప్రశ్నలతో పూర్తిస్థాయి ప్రశ్నావళిని రూపొందించి. ఆ ప్రశ్నాపత్రాన్ని మా సర్వే ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయి సర్వే చేస్తాం.
కరణ్ కాన్సెప్ట్స్ గ్రూప్ నుంచి సుమారుగా 1500 మందికి పైగా సర్వే ఏజెంట్లతో ఈ సర్వే నిర్వహించాం. నియోజకవర్గాల వారీగా ఒక్కో అసెంబ్లీ నియోజకర్గానికి అందులోని ఓటర్ల శాతంలో సుమారు 6 శాతం అంటే 6వేల నుంచి 7 వేల మంది ప్రజల నాడీని పట్టుకుంది మా దరువు టీవీ. ఈ ఆరు శాతంలో ఈ 7వేల మంది ప్రజలను ఆయా విభాగాలుగా విభజించాం. అందులో ముఖ్యంగా… వయస్సు, మతం, జెండర్, విద్యార్థత, కులం, వృత్తి, ఆర్థిక స్థితి.. ఇన్ని రకాలుగా విభజించి సర్వే చేశాం.
సర్వే ద్వారా వచ్చిన పూర్తి స్థాయి సమాచారాన్ని మా దగ్గర ప్రత్యేకంగా నియమించుకున్న (సెఫాలజీ టీమ్) ఎన్నికల విశ్లేషణ బృందంతో పూర్తిస్థాయిలో విశ్లేషణ జరిపి రూపొందించిన ఈ సర్వే ఫలితాలను మీ ముందు ఉంచుతున్నాం.
ఒక సారి సర్వే వివరాల్లోకి వెళ్తే…
ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముందన్న ప్రశ్నకు…
అన్నీ నియోజకవర్గాల సమాచారాన్ని ఒక్కటిగా చేయగా 69 శాతం వైసీపీ, 28 శాతం టీడీపీ, 1 శాతం జనసేన, 2 శాతం ఇతరులుగా వచ్చింది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే ప్రశ్నకు.. వైసీపీకి 134 సీట్లు, టీడీపీకి 37 సీట్లు, జనసేనకు ఒకటి, ఇతరులకు 3 సీట్లు గా వచ్చింది.
ఇక మతం ప్రాతిపాదికన సేకరించిన సమాచారంలో…
హిందువులు.. వైసీపీకి 49 శాతం, టీడీపీకి 38 శాతం, జనసేనకు 22శాతం, ఇతరులకు 5 శాతం
ముస్లీంలు.. వైసీపీకి 44 శాతం, టీడీపీకి 37 శాతం, జనసేనకు 18శాతం, ఇతరులకు 6 శాతం
క్రైస్తువులు.. వైసీపీకి 42 శాతం, టీడీపీకి 29 శాతం, జనసేనకు 2శాతం, ఇతరులకు 12 శాతం.
వయస్సు ప్రాతికపాదికన సేకరించిన సమాచారంలో…
60 సంవత్సరాల లోపువారు… వైసీపీకి 55 శాతం, టీడీపీకి 34 శాతం, జనసేనకు 18శాతం, ఇతరులకు 0 శాతం
60 సంవత్సరాల పైబడినవారు… వైసీపీకి 49 శాతం, టీడీపీకి 36 శాతం, జనసేనకు 21శాతం, ఇతరులకు 0 శాతం
50 సంవత్సరాల లోపువారు… వైసీపీకి 41 శాతం, టీడీపీకి 33 శాతం, జనసేనకు 21శాతం, ఇతరులకు 1 శాతం
40 సంవత్సరాల లోపువారు… వైసీపీకి 35 శాతం, టీడీపీకి 26 శాతం, జనసేనకు 14శాతం, ఇతరులకు 2 శాతం
20 సంవత్సరాల లోపువారు… వైసీపీకి 27 శాతం, టీడీపీకి 40 శాతం, జనసేనకు 23శాతం, ఇతరులకు 2 శాతం
వృత్తి ప్రాతిపాదికన సేకరించిన సమాచారంలో…
సొంత వ్యాపారం చేసుకునేవారు.. వైసీపీకి 40 శాతం, టీడీపీకి 32 శాతం, జనసేనకు 22శాతం, ఇతరులకు 1 శాతం
విద్యార్థులు.. వైసీపీకి 50 శాతం, టీడీపీకి 27 శాతం, జనసేనకు 16శాతం, ఇతరులకు 0 శాతం
రిటైర్ట్ ఉద్యోగులు.. వైసీపీకి 44 శాతం, టీడీపీకి 25 శాతం, జనసేనకు 18శాతం, ఇతరులకు 1 శాతం
ప్రైవేట్ ఉద్యోగులు.. వైసీపీకి 39 శాతం, టీడీపీకి 20 శాతం, జనసేనకు 15శాతం, ఇతరులకు 0 శాతం
గవర్నమెంట్ ఉద్యోగులు.. వైసీపీకి 60 శాతం, టీడీపీకి 31 శాతం, జనసేనకు 14శాతం, ఇతరులకు 2 శాతం
నిరుద్యోగులు.. వైసీపీకి 45 శాతం, టీడీపీకి 30 శాతం, జనసేనకు 27 శాతం, ఇతరులకు 1 శాతం
గృహిణులు.. వైసీపీకి 54 శాతం, టీడీపీకి 27 శాతం, జనసేనకు 7శాతం, ఇతరులకు 0 శాతం
రోజువారీ కూలీలు.. వైసీపీకి 50 శాతం, టీడీపీకి 20 శాతం, జనసేనకు 11శాతం, ఇతరులకు 2 శాతం
ప్రజల ఆర్థిక స్థితిగతుల ప్రాతిపాదికన సేకరించిన సమాచారంలో…
మధ్యతరగతి.. వైసీపీకి 49 శాతం, టీడీపీకి 29 శాతం, జనసేనకు 20శాతం, ఇతరులకు 2 శాతం.
పేద.. వైసీపీకి 52 శాతం, టీడీపీకి 41 శాతం, జనసేనకు 16శాతం, ఇతరులకు 0 శాతం
ధనిక.. వైసీపీకి 22 శాతం, టీడీపీకి 33 శాతం, జనసేనకు 25శాతం, ఇతరులకు 2 శాతం.
కుల వర్గీకరణ ప్రాతిపాదికన సేకరించిన సమాచారంలో…
ఎస్సీ.. వైసీపీకి 41 శాతం, టీడీపీకి 26 శాతం, జనసేనకు 17శాతం, ఇతరులకు 3 శాతం.
ఎస్టీ.. వైసీపీకి 35 శాతం, టీడీపీకి 22 శాతం, జనసేనకు 6శాతం, ఇతరులకు 2 శాతం.
బీసీ.. వైసీపీకి 57 శాతం, టీడీపీకి 26 శాతం, జనసేనకు 20శాతం, ఇతరులకు 3 శాతం.
ఓసీ.. వైసీపీకి 40 శాతం, టీడీపీకి 18 శాతం, జనసేనకు 13శాతం, ఇతరులకు 0 శాతం.
జెండర్ ప్రాతిపాదికన సేకరించిన సమాచారంలో…
మహిళలు.. వైసీపీకి 48 శాతం, టీడీపీకి 33 శాతం, జనసేనకు 16శాతం, ఇతరులకు 0 శాతం.
పురుషులు.. వైసీపీకి 41 శాతం, టీడీపీకి 31 శాతం, జనసేనకు 17శాతం, ఇతరులకు 7 శాతం.
విద్యార్హత ప్రాతిపాదికన సేకరించిన సమాచారంలో…
నిరక్షరాస్యులు.. వైసీపీకి 41 శాతం, టీడీపీకి 32 శాతం, జనసేనకు 21 శాతం, ఇతరులకు 1 శాతం.
డిగ్రీ మరియు పీజీ.. వైసీపీకి 44 శాతం, టీడీపీకి 27 శాతం, జనసేనకు 16 శాతం, ఇతరులకు 2 శాతం.
ఇతర చదువులు.. వైసీపీకి 27 శాతం, టీడీపీకి 42 శాతం, జనసేనకు 5 శాతం, ఇతరులకు 3 శాతం.
ఐటీఐ & పాలిటెక్నిక్.. వైసీపీకి 45 శాతం, టీడీపీకి 32 శాతం, జనసేనకు 7 శాతం, ఇతరులకు 2 శాతం.
ఇంజినీరింగ్ విద్యార్థులు.. వైసీపీకి 35 శాతం, టీడీపీకి 27 శాతం, జనసేనకు 15 శాతం, ఇతరులకు 2 శాతం.
టెన్త్ మరియు ఇంటర్.. వైసీపీకి 45 శాతం, టీడీపీకి 26 శాతం, జనసేనకు 10 శాతం, ఇతరులకు 1 శాతం.
ఇక జిల్లాల వారీగా ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం.
చిత్తూరు జిల్లా.. వైసీపీ 13, టీడీపీ 1, జనసేన 0, ఇతరులు 0
కడప జిల్లా.. వైసీపీ 10, టీడీపీ 0, జనసేన 0, ఇతరులు 0
శ్రీకాకుళం జిల్లా.. వైసీపీ 7, టీడీపీ 3, జనసేన 0, ఇతరులు 0
విశాఖపట్నం జిల్లా.. వైసీపీ 10, టీడీపీ 4, జనసేన 0, ఇతరులు 1
పశ్చిమగోదావరి జిల్లా.. వైసీపీ 10, టీడీపీ 4, జనసేన 1, ఇతరులు 0
కృష్ణా జిల్లా.. వైసీపీ 11, టీడీపీ 5, జనసేన 0, ఇతరులు 0
గుంటూరు జిల్లా.. వైసీపీ 12, టీడీపీ 5, జనసేన 0, ఇతరులు 0
ప్రకాశం జిల్లా.. వైసీపీ 11, టీడీపీ 1, జనసేన 0, ఇతరులు 0
విజయనగరం జిల్లా.. వైసీపీ 6, టీడీపీ 3, జనసేన 0, ఇతరులు 0
నెల్లూరు జిల్లా.. వైసీపీ 9, టీడీపీ 0, జనసేన 0, ఇతరులు 1
తూర్పు గోదావరి జిల్లా.. వైసీపీ 13, టీడీపీ 6, జనసేన 0, ఇతరులు 0
కర్నూలు జిల్లా.. వైసీపీ 12, టీడీపీ 2, జనసేన 0, ఇతరులు 0
అనంతపురం జిల్లా.. వైసీపీ 10, టీడీపీ 3, జనసేన 0, ఇతరులు 1 గా ఉన్నాయి. ఇలా పూర్తి స్థాయి సర్వే సమాచారం విశ్లేషణ తర్వాత మా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుంది.