నేచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు.అంతే జోష్ తో తన తర్వాత చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన విక్రమ్ ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల కానుందని చెప్పారు.అయితే మరోపక్క అక్కినేని నాగార్జున కూడా తన నెక్స్ట్ చిత్రం మన్మధుడు2 తో షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రం లో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి ఘట్టానికి వచ్చేసింది.అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని ఆగష్టు 29విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉందట.ఆరోజే ఎందుకు అంటే కింగ్ నాగార్జున పుట్టినరోజు కాబట్టి.ఇది ఇంక బయటకు చెప్పకపోయినా ఒకవేళ అప్పుడే రిలీజ్ చేస్తే మాత్రం ఈ ఇద్దరి హీరోలకు గట్టి పోటీ అని చెప్పాలి.
