ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు దాదాపు నూట యాబై కోట్ల నుండి రెండు వందల కోట్ల రూపాయలను పంచారు” అని ఆయన ఆరోపించారు. ఈ విషయం గురించి సాక్షాత్తు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఆయన ఖర్చు చేసిన పైసలన్నీ వృధా అని ఆయన అన్నారు. గ్రామాల్లో నోట్ల కట్టలు పంచారు. నగదు రూపంలో కాకుండా ఏసీలు,టీవీల రూపంలో ,టూవీలర్లు,బైకులు,మొబైల్స్ ఇలా పలు రూపాల్లో ఇష్టమోచ్చినట్లు పంచారని ఆయన విమర్శించారు. లోకేశ్ బాబు ఖర్చు చేసిన రెండు వందల కోట్లు వృధా అని ఆయన తేల్చి చెప్పారు..