తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పద్దెనిమిదేండ్లు వయస్సున్న ఒక బాలికకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం లింగన్నపేట నివాసి కనకట్ల దేవెందర్ బీడి కార్ఖానాలో పనిచేస్తుండేవాడు.
అతని సతీమణి బాలమణి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే వీళ్లకు పద్దెనిమిదేళ్ళు నిండిన రవళికి ఎదుగుదలలో లోపం ఉంది. అయితే వైద్యులను సంప్రదిస్తే సుమారు రెండు లక్షలకుపైగా ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రతి రోజు కూలీ పనికెళ్ళితేనే పూట గడవని దేవెందర్ దంపతులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సంప్రదించారు. దీంతో మానవత్వంతో స్పందించిన కేటీఆర్ రూ.2,00,000లు ఎల్వోసీ మంజూరు చేయించారు.
అంతేకాకుండా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రవళికి సరైన వైద్యం అందించాలని సూచించారు. రవళికి అన్ని విధాలుగా అండగా ఉంటానని కేటీఆర్ బాలిక కుటుంబ సభ్యులకు హామీచ్చారు. కేటీఆర్ చేసిన సాయంపై రవళి కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు. జీవితాంతం కేటీఆర్ గారికి రుణపడి ఉంటామని వారు చెబుతున్నారు