దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా జరగనున్న పోలింగ్ పర్వంలో కేవలం చివరి దశ మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫలితాల కోసం నిర్వహించే కౌంటింగ్‌పై అందరి ఆసక్తి నెలకొంది అయితే, ఈనెల 19న పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తాయని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ కలక ప్రకటన చేసింది. వైఎస్సార్సీపీ మీడియా సెల్ ఆధ్వర్యంలో మే 19న ఎగ్జిట్‌పోల్స్ సందర్భంగా టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చలకు హాజరయ్యే వారి వివరాలను అందించింది. పలువురి నేతల పేర్లను పేర్కొంటూ వారిని మాత్రమే చర్చలకు ఆహ్వానించాలని విజ్ఞప్తిచేసింది.
కాగా, వైసీపీ తరఫున సమర్థంగా గలం వినిపిస్తారని భావించిన వారి పేర్లనే ఈ జాబితాలో ఉంచినట్లు సమాచారం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల వారీగా వారి పేర్లను తెలిపింది. నేతల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు ఛానళ్ల కోసం
పార్థసారథి
సజ్జల రామకృష్ణారెడ్డి
అంబటి రాంబాబు
ఆర్.కె.రోజా
కాకాణి గోవర్దన్‌రెడ్డి
ఆదిమూలపు సురేష్
కోన రఘుపతి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గుడివాడ అమర్నాథ్
శ్రీకాంత్‌రెడ్డి
పుష్ప శ్రీవాణి
కురసాల కన్నబాబు
సుధాకర్‌బాబు
ఆళ్ల రామకృష్ణారెడ్డి
వాసిరెడ్డి పద్మ
తలసిల రఘురాం
ఎంవీఎస్ నాగిరెడ్డి
మల్లాది విష్ణు
వెల్లంపల్లి శ్రీనివాస్
ఇంగ్లిషు ఛానళ్ల కోసం:
విజయసాయిరెడ్డి
వైవీ సుబ్బారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
మిథున్ రెడ్డి
అనిల్ యాదవ్
బుట్టా రేణుక
పీవీపీ
హిందీ ఛానళ్లకోసం
మహ్మద్ ఇక్బాల్
రెహ్మాన్