తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని టీవీ9 మాజీసీఈఓ రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా వచ్చింది. రవిప్రకాశ్ బాటలోనే శివాజీ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని కోరారు. ఈమేరకు ఆయన మరో ఈ మెయిల్ పంపారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పరిశీలించిన పోలీసులు ఐపీ అడ్రస్ ల ఆధారంగా వీరిద్దరూ విజయవాడలో ఉంటున్నట్టు గుర్తించారట.. వీరికి ఓ బడాబాబు అమరావతిలో ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది.
