మోస్ట్ డిజైరబుల్ మెన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు.. టైమ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో ఈసారి సౌత్ నుండి వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు మాత్రమే ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా యూత్ లో పాపులారిటీ ఉన్న హీరోలను ఈ ప్రాతిపదికగా తీసుకుంటారు.. అయితే ఇప్పటివరకూ ఈలిస్ట్ లో కేవలం ముంబై హీరోలు మాత్రమే ముందుండేవారు.. అయితే ఇప్పుడు ఆస్థానాన్ని మహేష్ బాబు దక్కించుకన్నారు. పలు కమర్షియల్ యాడ్స్ తో పాటు ఎక్స్ పెరిమెంట్స్ చేయడం, అలాగే వరుసగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కంటెంట్ తో మహేష్ బాబు దేశవ్యాప్తంగా తన క్రేజ్ పెంచుకుంటున్నాడు.
మహర్షి సినిమాతో మహేశ్ ఎందరో మనసులను గెలుచుకున్నారు. నాన్ కాంట్రవర్సియల్ పర్సన్ గా ఇప్పటికే మహేశ్ కు మంచి పేరుంది. మహర్షి హిట్ తో కాలర్ ఎగరేసిన మహేష్ కు ఇది మరో సూపర్ హిట్ న్యూస్ అని చెప్పుకోవాలి. దేశంలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్ గా మహేష్ బాబు ఎంపికవడం పట్ల మహర్షి సినిమా టీంతో పాటు ముఖ్యంగా మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబులకే బాబు మా మహేశ్ బాబు అంటూ ఆయన అభిమానులు కాలర్ ఎగురేస్తున్నారు. కాగా మహర్షి సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి ఎందరో ప్రముఖులు అభినందించిన విషయం తెలిసిందే.