ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకింత సీరియస్ సబ్జెక్ట్ అయినా విషయం తెలిస్తే నవ్వు రాకుండా మానదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చాలామంది ఇప్పటికే ఒకసారి గెలిచాం కదా.. బాగానే సంపాదించుకున్నాం, మళ్లీ ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే మనం గెలవకపోతే పరిస్థితి ఏంటి.? మనం సంపాదించిన సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి.? గాలి బావుంటే గెలుస్తాం.. లేదంటే ఇంట్లో కూర్చుంటాం.. అనంసరంగా డబ్బు పోగొట్టుగోకూడదని నిర్ణయించుకున్నారట. కొందరైతే ఎన్నికల్లో ఖర్చులకు అధిష్టానం పంపిన డబ్బుకూడా మిగిల్చేసుకున్నారట.. ఈ వ్యవహారంపైనే ఇప్పుడు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఓ అభ్యర్ధి ఏకంగా అధిష్టానం పంపిన డబ్బుతో పొలాలు కొనుకున్నారట.
రాజధాని ప్రాంతంలోని ఓ మంత్రి ఇలా చేయడంతో టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన తాను పోటీ చేసిన దగ్గర ఖచ్చితంగా ఓడిపోతానని, ఇంకెందుకు డబ్బు ఖర్చు చేయాలని ప్రశ్నిస్తున్నారట. అయితే తన డబ్బుతోపాటు పార్టీ అధిష్టానం ఇచ్చిన సొమ్ముని కూడా ఖర్చు చేయకుండా పొలాలు కొనేసారట.. ఈ వ్యవహారంపై ఆయనను ప్రశ్నించగా ‘ఎలాగూ నేను గెలవను కదా.. తప్పేముంది.. అందుకే పొలాలు కొన్నాను’ అంటున్నారట. టిక్కెట్ ఇచ్చేటపుడు మాత్రం తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని తాను గెలుస్తానని పట్టుబట్టి టిక్కెట్ సాధించిన ఈమంత్రి ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరుతో చంద్రబాబు సైతం షాక్ కి గురయ్యారట. ఇటువంటి నాయకులను పార్టీలోకి తెచ్చుకుని మంత్రి పదవులు ఇస్తే గట్టిగా షాకిచ్చాడని, పార్టీ ఓటమికి కారణమవుతున్నారని పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.