Home / NATIONAL / తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు

తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు

మనలోనే కాదు భారతదేశంలోనే భిన్న సంస్కృతుల మేళవింపులు కన్పిస్తాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతో పర్యాటకంగా
ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిపై మనం ఒక లుక్ వేద్దామా ..
వారణాసి:గంగానది ఒడ్డున నెలవై ఉన్న కాశీ పట్టణాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైన సందర్శించాల్సిన చోటు
తాజ్ మహాల్:అగ్రాలో ఉన్న ఇది ప్రపంచ వింతల్లో ఒకటి .ఇది ఒక మధురమైన అనుభూతినిస్తుంది.
అంజునా:గోవాలోని ఈ ప్రదేశానికెళ్లితే విందు,వినోదాలు,ప్రకృతి అందాలు ,ప్రశాంత ప్రదేశాలు కన్పిస్తాయి

రాణ్ ఆఫ్ కచ్: ఇసుక తిన్నెల మీద నడవడం రోటీన్ ఐతే ఉప్పు మడులపై అడుగులేయడం ఇక్కడి ప్రత్యేకత
తవాంగ్: ప్రపంచంలో అతిపెద్ద టిబెటన్ బౌద్ధ కార్యశాల ఇది.ఇక్కడకెళ్లితే ఓ భిన్న సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక,ప్రశాంత భావనలు వస్తాయి.
కజిరంగా జాతీయ పార్కు: ప్రపంచంలో ఖడ్గ మృగాలకు ఉన్న సంరక్షణ కేంద్రాల్లో ఈ పార్కు ఒకటి
డార్జిలింగ్: ప్రకృతి అందాలకు నెలవు ఈ ప్రాంతం.
BR హిల్స్: బిలిగిరి రంగన్న హిల్స్ కు సంక్షిప్తరూపమే ఈ పేరు. కర్ణాటక తమిళనాడు సరిహద్దులో పులులకు నెలవు ఇది
మైసూర్:ఒక్కసారి కాలక్షేపం కోసం వెళ్తే శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా వెనక్కి రావచ్చు
రిషికేష్: ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా పేరొందింది
జైపూర్:రాజసం ,విలాసం,ఆభరణ రాశుల నగరం ఇది. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ప్రత్యేకమే
సిక్కిం: హిమాలయ సిగలో ఉన్న ఈ రాష్ట్రం భిన్న సంస్కృతులకు నిలయం.అడవులు,మైదాన పచ్చిక,పర్వతాలు,వెరైటీ వంటకాలకు ప్రసిద్ధి.

అమృతసర్:స్వర్ణ దేవాలయం,వాఘా సరిహద్దుతో ప్రపంచ ఖ్యాతి. దేశ భక్తితో ఒళ్ళు పులకరించిపోవాలంటే ఇక్కడి బీటింగ్ రిట్రీట్ పరేడ్
చూడాల్సిందే
చిన్నకనాల్: తేయాకు ప్రసిద్ధి. సినిమాల్లోని పలు పాటలు ఇక్కడే తీస్తారు
హంపి:ఇక్కడి దేవాలయలు,బాదామీ గుహలు ఓ కొత్త అనుభూతినిస్తాయి
మేఘాలయ:ఇక్కడ కొండలను చేరితే మేఘాల్లో ఉన్నట్లే అన్పిస్తుంది.ఇక షిల్లాంగ్,వేర్లతో ఉన్నవంతెన ప్రత్యేక ఆకర్షణ
షిమ్లా:హిమాలయ పర్యాటక ప్రదేశాల్లో ఇది ముఖ్యమైనది
జైసల్మేర్: రాజస్థాన్ వెళ్లినవారు తప్పక చూడాల్సిన ప్రదేశం.కోట,టవర్,ఇప్పటికి చెక్కు చెదరని మట్టి కట్టడాలు మనల్ని కట్టిపడేస్తాయి
అయితే ఇలా చెప్పుకుంటే పోతే మన దేశంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే చాలా ఖర్చుతో కూడినది . మరి సమయం
కూడా ఎక్కువపడుతుంది. అందుకే తగినంత మనీ,టైం ఉన్నప్పుడు మీరు కూడా అలా చుట్టేసి రండి .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat