సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం సంచలన విజయం కూడా సాధించింది. టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు మహేష్ పై ప్రసంశల జల్లు కురిపించారు.ఈ చిత్రంలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిలో నాటుకుపోయింది.మొన్న మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి మహేష్ ని ప్రసంశించారు.స్టొరీ పరంగా రైతులపై మంచిగా చూపడంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని మెచ్చుకున్నారు.ఇదంతా ఎలా ఇంతే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో పాపులర్ అవుతున్న విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటివరకూ సినిమా కోసం ఎటువంటి ట్వీట్ చేయలేదు.విజయ్,మహేష్ చాలా క్లోజ్ గా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు.అలాంటి మహేష్ సినిమాకు ఇప్పటివరకు మాట్లాడకపోవడంపై అందరు కోపంగా ఉన్నారనే చెప్పుకోవాలి.
