టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే ఇప్పుడు హిందీలో కబీర్ సింగ్ పేరుతో దీని రీమేక్ తీస్తున్నాడు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.అయితే వీరిద్దరూ ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడడం జరిగింది.ఇందులో బాగంగానే ఒక రిపోర్టర్ కియారా అద్వానీని ఒక ప్రశ్న అడిగాడు..ఈ చిత్రంలో ఎన్ని ముద్దు సీన్లు ఉంటాయి అని అడగగా నేను లెక్కపెట్టలేదు అని సమాధానం చెప్తుంది..ఇంతలో షాహిద్ కపూర్ మాట్లాడుతూ సినిమాలో ముద్దుకే డబ్బులు తీసుకున్నాం అని చెబుతాడు.ఐన వదలని ఆ రిపోర్టర్ అదే ప్రశ్న అడుగుతాడు.దీంతో అతడిపై కోపడ్డ షాహిద్ కపూర్..నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? కిస్ సీన్లు తప్ప వేరే ఆలోచన రాదా నీకు అంటూ ప్రశ్నిస్తాడు.