ఆమె ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు సింహాస్వప్నం.. ఆమె పంచులేస్తే ఎదుటివాళ్లకు ముఖంపై తడి ఉండదు. పెదాలపై చిరునవ్వు ఉండదు. ఆ పంచులకు సమాధానం ఉండదు. ఆమె ఎక్కుపెట్టిన ఆస్త్రాలకు తిరుగులేదు. అలాంటి ఆమె ఎందుకు ఉన్నట్లు మౌనం దాల్చారు. ఎప్పుడు ఎవరు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు ఎవరిపైన అధికార పార్టీ నేతలు కౌంటరిస్తే క్షణాల్లో ప్రెస్ మీట్ పెట్టి మరి తిరుగులేని ఎన్కౌంటర్ ఇచ్చే ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇంతకు ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా..?. ఏపీ ఫైర్ బ్రాండ్ .. వైసీపీ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనని సోదరిగా భావించే ఆర్కే రోజా.
ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి బరిలోకి దిగిన ఆర్కే రోజా ఎన్నికల తర్వాత కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చారు. అలా ఫ్యామిలీతో గడిపిన తర్వాత ఏపీకి తిరిగోచ్చిన ఆమె ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై,అటు వైసీపీ నేతలపై రోజుకో విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. తన అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు,తన అన్నయ్య అయిన వైసీపీ అధినేత జగన్ ను ఒక్క మాట అన్నా కానీ ఊరుకోని రోజా ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.
అయితే ఆర్కే రోజా మౌనం వెనక బలమైన కారణం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలైన దగ్గర నుండి వాసిరెడ్డి పద్మ,ఎంపీ విజయసాయి రెడ్డి మినహా ఎవరు అధికార పార్టీ నేతలపై విరుచుకుపడటంలేదు. అయితే కొంత మంది నేతలు మాత్రం ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఆర్కే రోజా మౌనం వెనక ఉన్న అసలు కారణం ఈ నెల ఇరవై మూడున విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ నూట ఇరవై నుండి నూట నలబై స్థానాలు గెలువబోతుంది. నగరి నుండి ఆర్కే రోజా బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నట్లు వైసీపీ ప్రభంజనం ముందు ఆర్కే రోజా మౌనంగా ఉంటున్నారు అని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఆర్కే రోజా మౌనం వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలియాలంటే మరో ఎనిమిది రోజులు ఆగాలి అన్నమాట..లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నమాట..