మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రానుంది.ఇలాంటి సమయంలో ప్రతీ జట్టు కప్ గెలవాలనే పట్టుదలతో ఉంటారు. ఇండియా,పాకిస్తాన్,ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,బంగ్లాదేశ్,సౌతాఫ్రికా,న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్.ఈ పది జట్లు రెండు గ్రూప్స్ గా ప్రపంచకప్ బరిలోకి దిగనున్నాయి.అయితే ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.దీంతో అందరి దృష్టి ఇంగ్లాండ్ పైనే ఉంది.ఇంగ్లాండ్ కి ఇది హోమ్ పిచ్ కావడంతో 2019 ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగనుంది.ఇక డిపెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే..ప్రస్తుతం ఆ జట్టు అంతగా ఫామ్ లో లేదనే చెప్పాలి.ఏది ఎలా ఉన్న ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.న్యూజిలాండ్,సౌతాఫ్రికా కి మాత్రం వాళ్ళది ఎంత మంచి టీం ఐన సరే సెమీస్ లో వెనుదిరగడం ఖాయమనే చెప్పుకోవాలి.
ఇక భారత్ కు బద్ధ శత్రువైన పాకిస్తాన్ విషయానికి వస్తే..పాక్ ఇంగ్లీష్ పిచ్ లలో మంచి పట్టు ఉందని చెప్పుకోవాలి.భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా భారత్ కు గట్టి పోటీ ఇచ్చేది పాక్ అని చెప్పుకొచ్చారు.ఇక భారత్ విషయానికి వస్తే ఓపెనింగ్ లైన్ అప్ మంచిగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే..ఓపెనర్స్ రోహిత్,ధావన్ మంచి ఫామ్ లో ఉన్నారు.ధావన్ అయితే ఇంగ్లాండ్ పిచ్ పై మంచి స్ట్రైక్ రేట్ కూడా ఉంది.కోహ్లి,జాదవ్,ధోని తో గట్టిగానే ఉంది.అల్ రౌండర్స్ లో హార్దిక్ పాండ్య అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి.ఇక బౌలర్స్ బుమ్రా,చాహల్,కుల్దీప్,భువనేశ్వర్ ఉన్నారు.ఓవర్ అల్ గా ఇండియా ప్రపంచకప్ కు సిద్ధమనే చెప్పాలి.