వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఆ సంస్థ శుభవార్తను ప్రకటించింది.ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే దేశాల్లో ఒకటైన చైనా కు చెందిన ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద స్టోర్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు మమ్మురం చేసింది. అందులో భాగంగా నిన్న మంగళవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రొ ను అవిష్కరించింది. ఈ క్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతోపాటు ముంబై, పుణేలలో కూడా రెండు ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ప్రారంభించినట్లు కూడా ప్రకటించింది.వన్‌ప్లస్ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లో 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అరంతస్థుల భవనం నిర్మిస్తున్నామని సీఈవో పీట్ లౌ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి స్టోర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
We are excited to announce that we will be opening the biggest OnePlus store in the World later this year in Hyderabad. #OnePlus7SeriesLaunch pic.twitter.com/oxFoKghgcc
— OnePlus India (@OnePlus_IN) May 14, 2019