ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి అన్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్రంలో మూడు విడతల్లో ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు.
కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా 32 జిల్లాల్లో 123 సెంటర్ల లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. 5 వేల 659 స్ట్రాంగ్ రూంలలోని బ్యాలెట్ పేపర్లు తీసుకువస్తామని చెప్పారు. ఒక్కో ఎంపీటీసి కి 2 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
