Home / 18+ / భారతదేశం గర్వించదగ్గ హీరో మహేష్ బాబు..వెంకయ్యనాయుడు

భారతదేశం గర్వించదగ్గ హీరో మహేష్ బాబు..వెంకయ్యనాయుడు

సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు జల్లు కురిపిస్తుంది.ఇందులో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటించిన విషయం అందరికి తెలిసిందే.మహర్షి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిని ఆకట్టుకుంది.ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఇప్పుడు మహర్షి తో పల్లెల్లో కూడా మంచి పేరు వచ్చింది.ఇక ఈ చిత్రం పై భారత దేశ ఉపరాష్ట్రపతి స్వయంగా ట్వీట్ చేసారు.”కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది.

గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా.గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat