పాయల్ రాజపుత్..ఈ పేరు వినగానే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆర్ఎక్స్ 100 సినిమానే.ఈ చిత్రం కుర్రకారును ఒక ఊపు ఊపిందని చెప్పుకోవాలి.ఎందుకంటే అందులో ఉండే లవ్,రొమాన్స్ అంతా ఇంతా కాదు.ఈ చిత్రాన్ని అజయ్ భూపతి డైరెక్ట్ చేయగా కార్తికేయ హీరోగా నటించాడు.దీంతో ఈ నటికి టాలీవుడ్ లో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి.ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలో అవకాశం వచ్చింది.దీనికి దర్శకత్వ భాద్యతలు కేఎస్ రవికుమార్ తీసుకున్నారు.మరోపక్క ఈ ముందుగుమ్మ పంజాబీ సినిమాతో అడుగుపెట్టింది.బాలకృష్ణ తోనే కాకుండా ఇప్పుడు రవితేజతో ‘డిస్కో రాజా’ కూడా నటించనుంది.ఇది ఇలా ఉండగా వెంకటేష్,నాగచైతన్య నటిస్తున్న చిత్రం వెంకీ మామా.ఇందులో నాగచైతన్య సరసన నటించనుంది.ప్రస్తుతం ఈ భామ తేజ డైరెక్టర్ గా కాజల్,బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటిస్తున్న సీత లో ఐటెం సాంగ్ లో నటిస్తుంది.
